ఇంద్రాణి ముఖర్జియాకు అస్వస్థత
|
ఇంద్రాణి ముఖర్జియా |
ముంబయి: ఐఎన్ఎక్స్ మీడియా మాజీ అధినేత ఇంద్రాణి ముఖర్జియా తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించారు. కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముంబయిలోని బైకుల్లా జైల్లో ఉన్నారు. అయితే ఆమెకు గత రాత్రి అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు వెంటనే ఆమెను జేజే ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఇంద్రాణి ఇదే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇంద్రాణి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ఎమర్జెన్సీ వార్డుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు.
No comments:
Post a Comment